Site icon vidhaatha

కల్పిక, ధన్య.. దిగజారిపోతున్నారు..!

విధాత‌: క్రికెట్ ఆట గురించి గతంలో ఒక పెద్దాయన 11 మంది పనికిమాలిన వారు ఆడుతుంటే 11,000 మంది పని లేని వారు చూస్తూ ఉంటారని వ్యాఖ్యలు చేశాడు. అది సోమరుల ఆట.. దానికి బానిస కావద్దంటూ హెచ్చరించాడు. ఆ సంగతి ఏమోగానీ ప్రస్తుతం ఏ పని పాటా లేని కల్పికా గణేష్, ధన్య బాలకృష్ణల గొడవ వీధి కుక్కల కోట్లాట వలె తయారైంది. దీన్నే బాగా చెప్పాలంటే గ్రామ సింహాల పోరాటం అంటారు. ఇంకా పాలిష్‌డ్‌గా చెప్పాలంటే వీధి కుళాయిల వ‌ద్ద జ‌రిగే ర‌భ‌స‌.

ధన్య బాలకృష్ణ విషయానికి వస్తే ఆమె ఒక సినీ బుల్లితెర నటి. బెంగళూరులో పుట్టిన తమిళ అమ్మాయి. తెలుగువారికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌ని ప్రేమించాననే అమ్మాయి పాత్రలో పరిచయం. ఈమె తమిళంతో పాటు తెలుగులో విడుదలైన సూర్య- మురగదాసుల చిత్రం ‘సెవెంత్ సెన్స్’ తో నటిగా పరిచయమైంది.

ఇక క‌ల్పికా గణేష్ గురించి చెప్పుకోవాలంటే ఈమె కూడా ఒక తెలుగు సినీ నటి. హైదరాబాదులో పుట్టి పెరిగింది. 2009లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రయాణం’ సినిమాతో న‌టిగా ప‌రిచ‌యం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటించింది. దర్శకత్వ విభాగంలో కూడా పనిచేస్తుంది. పర్ఫెక్ట్ కాపీ అని ఐదు నిమిషాల షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించింది. తాజాగా వీరిద్దరి మధ్య గోల, రభస, కొట్లాట జరుగుతోంది. దాని గురించి తెలుసుకోవాలంటే ఓసారి ఆ గొడవ ఏంటో చూద్దాం…!

క‌ల్పిక గ‌ణేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమాల గురించి మాత్రమే కాకుండా నటీనటుల గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేస్తుంటుంది. తాజాగా ఆమె ధన్య బాలకృష్ణకు తమిళ దర్శకుడు బాలాజీ మోహ‌న్‌తో సీక్రెట్‌గా పెళ్లి జరిగినట్టు చెప్పి షాక్ ఇచ్చింది.

ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్న బాలాజీ ధన్యను రెండో వివాహం చేసుకున్నాడని, కానీ ఈ విషయాన్ని వాళ్ళిద్దరూ బయట పెట్టలేదని షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ వీడియో కొన్ని గంటలలోనే డిలీట్ అయిపోయింది. దీనికి కల్పిక స్పందిస్తూ ధన్య ఫోన్ చేసి బెదిరించి ఈ వీడియోను డిలీట్ చేయించింది… అంటూనే రచ్చకు ఆజ్యం పోసింది.

నీ పవర్ చూపించి నీ గురించి నేను పెట్టిన వీడియోను యూట్యూబ్లో లేకుండా చేశావు. నా పవర్ కూడా చూపిస్తే భస్మం అయిపోతావు… అంటూ శాపనార్ధాలు పెట్టింది. అంతేకాదు నా పవర్ ఏంటో నీకు చూపిస్తా. కోర్టులో కలుద్దాం…. అంటూ అల్టిమేటం జారీ చేసింది.

ఈ విషయంపై ధన్యా కూడా తీవ్రంగా మండిపడింది. కల్పిక పెద్ద తాగుబోతు…. స్మోకింగ్ కూడా ఎక్కువగా చేస్తుంది. గంజాయి కొట్టి ఏది పడితే అది వాగుతూ ఉంటుంది. ఎప్పుడూ మైకంలోనే ఉంటుంది. తెలుగమ్మాయి అనే ట్యాగ్‌ను వాడుకొని పాపులర్ అయినట్టు ఫీల్ అవుతుంది.

ఆమె చేసిన కామెంట్లు ఆమెకే గుర్తుండవు…. ఆమె చేసిన కామెంట్స్ నేను పట్టించుకోను. మీరు కూడా పట్టించుకోకండి. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి అంటూ విలువైన స‌మాచారం తెలిపింది.

ఈ విషయంపై కోలీవుడ్‌లో మహా జోరుగా చ‌ర్చ‌లు జరుగుతున్నాయి. వీళ్లిద్దరూ గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించారు. కానీ ఆ మూవీలో అదృష్టవశాత్తు వీరి మధ్య కాంబినేషన్ సీన్స్ అయితే లేవు.

Exit mobile version