- నాటు నాటు, డీజే టిల్లు పాటలకు కలక్టర్
- నాది నక్కిలీసు గొలుసు.. పాటపై ఆయన సతీమణి ప్రియాంక డ్యాన్స్
విధాత: పాలనాపరమైన విధుల్లో నిత్యం బిజీగా ఉండే ఐఏఎస్ అధికారులు హోలీ పండుగ రోజు సామాన్యులుగా మారిపోయారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్(RV Karnan), ఆయన సతీమణి జడ్పీ సీఈవో ప్రియాంక(Priyanka) పాపులర్ సినిమా పాటలకు స్టెప్పులేసి రంగుల పండుగకు కొత్త శోభ తెచ్చారు.
ఇటీవల అంతర్జాతీయ వేదికలపై మారుమోగుతున్న ‘నాటు నాటు’ పాటకు, డీజే టిల్లు పాటకు కలెక్టర్, ‘నాది నక్కిలీసు గొలుసు’.. పాటకు ఆయన సతీమణి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. హోలీ సంబరాల్లో పాలుపంచుకునేందుకు కలెక్టరేట్ ఉద్యోగులు క్యాంపు కార్యాలయానికి చేరుకోగా, కలెక్టర్ దంపతులు వారితో రంగులు చల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.