Site icon vidhaatha

Karimnagar | బైక్ దొంగగా అనుమానించి.. యువకుడిని చితకబాదిన పోలీసులు

Karimnagar |

విధాత బ్యూరో, కరీంనగర్: బైక్ దొంగ అని అనుమానించి ఓ యువకుడిని పోలీస్ స్టేషన్లో చితకబాదిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించింది. తన బైక్ పని చేయడం లేదని, స్టేషన్ కు వెళ్లి తీసుకురావాలని వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పని చేసే జమాలుద్దీన్.. సికిందర్ అనే యువకుడిని పురమాయించారు.

అయితే ఆ యువకుడిని దొంగగా అనుమానించిన పోలీసులు చితకబాదారు. వేములవాడ పోలీస్ స్టేషన్ పక్కనే ప్రభాకర్ అనే వ్యక్తి బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నారు.

మెకానిక్ షాప్ లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన సికందర్ అనే యువకుడిని వేములవాడ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఏఎస్ఐ జమాలుద్దీన్ తన ద్విచక్ర వాహనం పనిచేయడం లేదని, బైక్ తీసుకురమ్మని పోలీస్ స్టేషన్ కు పంపించగా, ఆ యువకుడ్ని దొంగగా అనుమానించి ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్, తన సిబ్బందితో కలిసి ఇష్టం వచ్చినట్లు చితక బాదారు.

యువకుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అసలు విషయం అర్థమైన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇందుకు సంబంధించి వార్తలు రాకుండా చూసేందుకునానా తంటాలు పడ్డారు.

Exit mobile version