విధాత: కర్నాటక రాష్ట్ర గృహ నిర్మాణం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జామీర్ అహ్మద్ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరు, పథకాల అమలుతీరుపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం దిశగా వ్యూహాలపైన చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
కాంగ్రెస్ తొలి జాబితాలో ఎంపీ అభ్యర్థులుగా టికెట్ దక్కించుకున్న మహబూబ్‌నగర్, జహీరాబాద్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, సురేష్ షేట్కార్, బలరాంనాయక్‌లు సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు టికెట్ రావడంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉందంటూ వారు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా సీఎంతో భేటీ కాబోతున్నారు.