Site icon vidhaatha

MLC Kavitha | 10 ఫోన్లతో.. ED ఆఫీసుకు MLC కవిత

విధాత: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వరుసగా రెండో రోజు కూడా ఈడీ విచారణకు హాజరైంది. విచారణకు వెళ్లే ముందు కవిత తను వాడిన 10 ఫోన్‌లను మీడియా ముందు ప్రదర్శించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులు అనుమానితురాలుగా ఉన్న కవిత తాను వాడిన 10 ఫోన్లను ధ్వంసం చేసినట్లుగా ఈడీ అభియోగాలు మోపింది.

అయితే తాను ఫోన్లను ధ్వంసం చేయలేదని ఫోన్లను ఈడీ అధికారులకు చూపించేందుకు తీసుకెళ్తున్నానన్నట్లుగా ఆమె విచారణకు వెళ్లే ముందు ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు.

ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా ఒక లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే తనను విచారిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈడీ ఆరోపించినట్లుగా తాను ఫోన్లను ధ్వంసం చేయలేదని వాటిని మీకు అప్పగిస్తున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు.

మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేంద్రకు ఎమ్మెల్సీ లేఖ!

MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం మరోసారి మీడియాకు హాజరయ్యారు. ఈడీ విచారణకు హాజరవడం ఇది మూడోసారి. సోమవారం విచారణకు హాజరైనసమయంలో దాదాపు పది గంల వరకు విచారించింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ సాగిన విషయం తెలిసిందే. ఈ విచారణలో దాదాపు 14 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆ తర్వాత మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

ఈ క్రమంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. తన పాత ఫోన్లను వెంట తీసుకుని కవిత వెళ్లారు. కవర్లలో తీసుకువెళ్తున్న ఫోన్లను మీడియాకు చూపించారు. కవిత కొన్ని నెలల్లోనే పది ఫోన్లు మార్చారంటూ మద్యం పాలసీ కేసులో దాఖలు చేసిన చార్జీషీట్‌లో ప్రస్తావించింది. కవిత ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. మద్యం కేసు ఆధారాలున్న ఫోన్లను ధ్వంసం చేశారని పేర్కొనగా.. ఈ మేరకు విచారణ సందర్భంగా తాను వాడిన ఫోన్లను కవిత వెంట తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మరో వైపు కవిత ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేంద్రకు లేఖ రాశారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈడీ ఆరోపించిన పది ఫోన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఐఎంఈఐ నంబర్లతో సహా ఫోన్లను జమ చేస్తున్నట్లు కవిత చెప్పారు. మహిళా స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలిగేలా నా ఫోన్లను అడిగారని, అయినా తన తన గోప్యతకు భంగం కలిగినప్పటికీ ఫోన్లను అందజేస్తున్నానన్నారు.

తాను ఉపయోగించిన ఫోన్లన్నీ ఈడీకి జమచేస్తున్నానన్నారు. ఈడీ దర్యాప్తనుకు సంబంధించి మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు లీకులు ఇస్తున్నారని, తమ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని లేఖలో ఆరోపించారు కవిత.

Exit mobile version