Site icon vidhaatha

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులు ఖరారు.. వారెవరంటే.?

ఖమ్మంకు నామా..మహబూబాబాద్‌కు మాలోతు కవిత

కరీంనగర్‌కు బి.వినోద్‌కుమార్‌..పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌


విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నాలుగు ఎంపీ స్థానాలకు పోటీ చేయనున్న బీఆరెస్ పార్టీ అభ్యర్థులను బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఖమ్మం బీఆరెస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును, మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా మాలోత్ కవితల పేర్లను కేసీఆర్ ప్రకటించారు.


కరీంనగర్ అభ్యర్థగా బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లను ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశం అనంతరం కేసీఆర్ వారి పేర్లను అధికారికంగా ప్రకటించారు. త్వరలో మిగతా ఎంపీ స్థానాల బీఆరెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు.

Exit mobile version