REVANTH REDDY WARANGAL
- కమ్యూనిస్టులతో జాతీయస్థాయిలో మాత్రమే పొత్తు
- సంక్షేమ పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?
- కొత్తకొండ వీరభద్రుడిని దర్శించుకున్న టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా తీర్పు తాకట్టు పెట్టి, రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ (KCR) విస్మరించారని పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి REVANTH REDDY విమర్శించారు. కుటుంబ సభ్యుల పదవుల కోసం తహతహలాడుతున్నాడని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్ పేరుతో దేశ సంచారం చేస్తున్న బికారి అంటూ ఎద్దేవా చేశారు.
గురువారం హనుమకొండ (Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామిని రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు.
అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్(kcr) స్వతహాగా ముసలోడిని అయ్యానని అన్నారని, అందుకే మా కాంగ్రెస్ కార్యకర్తలు బై బై కేసీఆర్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న భూదందాల వ్యవహారం బహిర్గతం అవుతుందని ఉద్దేశం ప్రకారమే భూపాలపల్లిలో 144 సెక్షన్ పెట్టి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.
ఎంపీగా గెలిచి కేసీఆర్ ఏం చేశారు?
(Karimnagar)కరీంనగర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఈ ప్రాంతానికి ఏం చేశాడని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించే లీడర్‌నే ఎన్నుకోవాలన్నారు. రాష్ట్ర సాధన కోసం పొన్నం ప్రభాకర్ పోరాటం యావత్తు దేశ ప్రజలకు తెలుసని, అందుకే అటువంటి యువకుడిని ప్రజలు ఎన్నుకోవాలని ఆయన అన్నారు.
సంక్షేమం పై బహిరంగ చర్చకు సిద్ధమా
బిఆర్ఎస్ (BRS)అవలంబిస్తున్న సంక్షేమ పథకాల విధానాలపై కాంగ్రెస్ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందని రేవంత్ సవాల్ విసిరారు. తక్షణమే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చి ఏపీ, కేంద్రంలో అధికారం కోల్పోయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటుందని అన్నారు.
కమ్యూనిస్టులతో జాతీయ స్థాయిలో పొత్తు
కమ్యూనిస్టు పార్టీతో (Communist) రాష్ట్ర స్థాయిలో కాకుండా, జాతీయ స్థాయిలో మాత్రమే పొత్తులు ఉంటాయని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్ల పునరుద్ధరణ, గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలు, ఐదు లక్షలతో ఆరోగ్యశ్రీ, ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొస్తామని అన్నారు.
కొత్తకొండపై నిర్లక్ష్యం
మండలానికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్నప్పటికీ కొత్తకొండ (Kothakonda)ను మండలం చెయ్యకుండా ఎందుకు వివక్ష చూపారని ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలకే సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్న కేసీఆర్‌కు కుర్చీ దొరకడం లేదా అని అన్నారు. KCR తన శేష జీవితాన్ని ఇక ఫామ్ హౌస్‌లోనే శాశ్వతంగా గడపనున్నారని దానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. అనంతరం గండిపల్లి ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారన్నారు.