Site icon vidhaatha

నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యం: సీఎం కేజ్రీవాల్‌


విధాత : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను విచారణ నిమిత్తం ఈడీ కోర్టును మరో ఏడు రోజుల కస్టడీ కోరింది. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్‌పై గురువారం వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కేజ్రీవాల్ స్టేట్‌మెట్ రికార్డు చేశామని, తప్పించుకునేలా సమాధానాలు చెప్తున్నారని ఈడీ ఆరోపించింది.


ఆప్‌ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి కేజ్రీవాల్‌ను ప్రశ్నించాల్సివుందని, అలాగే పంజాబ్ ఎక్సైజ్ అధికారులకు నోటీసులు ఇచ్చామని, కేజ్రీవాల్‌ను మరో ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని ఈడీ కోరింది. కోర్టులో సొంతంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్‌ నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యంగా ఉందని ఆరోపించారు. సీబీఐ 31 వేల పేజీలు, ఈడీ 25 వేల పేజీల చార్జిషీట్లలో ఎక్కడ నా పేరు లేదని, అలాగే మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన ఏడు స్టేట్మెంట్లలో ఆరింటిలో నా పేరు లేదని, 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారని, ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.


కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట

సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో గురవారం విచారణ సాగింది. అయితే ఈ పిటిషన్‌ న్యాయబద్ధంగా లేదని, న్యాయపరమైన జోక్యానికి అవకాశం లేదని హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. జైల్లో నుంచి ప్రభుత్వాన్ని నడపడంలో చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడిన ఢిల్లీ హైకోర్టు పిటిషన్ డిస్మిస్ చేసింది.

Exit mobile version