Kishan Reddy | ఫోన్ ట్యాపింగ్‌లో కేటీఆర్ కీలకం: కిషన్‌రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా మాజీ సీఎం కేసీఆర్ ప్రొద్భలంతోనే జరిగిందని, కేటీఆర్ పర్యవేక్షలోనే ట్యాపింగ్ నడిచిందని, ఈ కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

  • Publish Date - April 13, 2024 / 05:10 PM IST

విధాత, హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా మాజీ సీఎం కేసీఆర్ ప్రొద్భలంతోనే జరిగిందని, కేటీఆర్ పర్యవేక్షలోనే ట్యాపింగ్ నడిచిందని, ఈ కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో రాజకీయ నాయకులే కాకుండా సినీ నటులు, వ్యాపారులు ఉన్నారని, బ్లాక్ మెయిల్ చేసి డబ్బుల వసూళ్ల కోసం కూడా ట్యాపింగ్ వాడుకున్నారని ఆరోపించారు.

దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను దెబ్బ తీయడానికి ఫోన్ ట్యాపింగ్ చేశారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీస్ వాహనాల్లో బీఆరెస్ నేతల కోసం డబ్బులు పంపిణీ చేసినట్టు విచారణలో అధికారులు ఒప్పుకున్నారన్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రత, టెలిగ్రాఫ్‌, ప్రజాప్రాతినిధ్య చట్టాలతో సహా ఎన్నికల చట్టాలను, నియమాలను సైతం ఉల్లంఘించారని ఆరోపించారు. ట్యాపింగ్‌లో పోలీసులే నిందితులుగా ఉన్నారని, వారు గతంలో విచారణాధికారులకు సహచరులు కాబట్టి కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే కేసును రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాల్సిన అవసరముందన్నారు.

Latest News