విధాత: దేశం కోసం విధులు నిర్వహిస్తూ.. ప్రాణాలు విడిచిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడి ఆదుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) కోరారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షల ఎగ్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.
ఈ విషయంలో సీఎం కేసీఆర్ (CM KCR) చొరవ తీసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలన్నారు. వినయ్ భానురెడ్డి భార్య స్పందన ఆర్మీలో డెంటిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు(హానిక, హారిక). ప్రస్తుతం మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో నివసిస్తున్నారన్నారు. ఉన్న ఊరిని, కన్నతల్లిని, నమ్ముకున్న కుటుంబాన్ని వదిలి దేశం కోసం పనిచేస్తూ మృతి చెందిన అమర సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.