Komuram Bheem Asifabad
విధాత: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ సర్పంచ్ తాహెర బేగం కుమారుడు అబ్దుల్ రషీద్ పై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంఘం నాయుడు, ఉమ్మడి జిల్లా జడ్పి మాజీ చైర్మన్ సిడాం గణపతి మీడియాతో మాట్లాడుతూ..
డబ్బా గ్రామంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కుమారుడు రషీద్ ఆదివాసి ఇళ్లలో రాత్రి వేళల్లో చొరబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆదివాసీలు ఆరోపించారు.
ఇదే క్రమంలో సోమవారం రాత్రి ఓ మహిళ ఇంట్లో చొరవ బడడాన్ని గమనించిన ఆదివాసీలు రషీద్ ను పట్టుకొని ప్రశ్నించగా నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టడమే కాకుండా కులం పేరుతో దూషించాడని, మీవల్ల ఏమీ కాదని నన్ను ఏమి చేయలేరని భయభ్రాంతులకు గురిచేశాడని పేర్కొన్నారు.
రషీద్ అధికార పార్టీలో కొనసాగుతూ ప్రభుత్వం నుండి అందజేసే సంక్షేమ పథకాలు అందజేస్తామని మహిళలకు మాయ మాటలు చెబుతూ వారిని లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రషీద్ పై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆదివాసీలతో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి స్థానిక నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆయన వెంట ఆదివాసి సంఘం నాయకులు నారాయణ, బీజేపి జిల్లా కార్యదర్శి దోని శ్రీశైలం, తదితరులు ఉన్నారు.