Site icon vidhaatha

కృష్ణంరాజు పార్థీవ‌దేహాన్ని మోసిన ఆయ‌న స‌తీమ‌ణి

విధాత‌, హైద‌రాబాద్: కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఆయన భార్య సతీమణి శ్యామలాదేవి పాడె వ‌ర‌కు మోసుకెళ్లారు. ఇండస్ట్రీలో ఆది దంపతులుగా పేరున్న కృష్ణంరాజు, శ్యామ‌లాదేవి ఏ కార్యక్రమానికైనా కలిసే వెళ్లేవారు. ఈ క్ర‌మంలోనే ఆమె పార్థీవ దేహాన్ని త‌ర‌లించే క్ర‌మంలో త‌న‌ భర్త పార్థివదేహాన్ని భుజాలపై మోస్తూ వాహనం వరకు తీసుకెళ్లారు.

కృష్ణంరాజును కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు భారీగా తరలివ‌చ్చారు . జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి మెయినాబాద్లోని కనకమామిడ ఫామ్‌ హౌజ్ కు భౌతికకాయాన్ని తరలించే ముందు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు ప్ర‌తి ఒక్క‌రిని కంట‌త‌డి పెట్టిస్తున్నయి.

Exit mobile version