Site icon vidhaatha

Krishna Rao | ముగిసిన పెద్ద బాబాయి అంత్యక్రియలు

Krishna Rao | విధాత‌: పెద్ద బాబాయి సీహెచ్ వీఎం కృష్ణారావు అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు మిత్రులు బాబాయి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు, బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, వీ హనుమంతరావు, మాజీ ఎంపీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కే శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్ తదితరులతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

Exit mobile version