KTR | విధాత: పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి తనకు 50కోట్లు ఇచ్చారంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో తనపై చేసిన ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీస్‌లు పంపించారు. కేటీఆర్ నోటీస్‌లకు రిప్లై ఇవ్వని పక్షంలో మధురై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. గతంలో ఇవే ఆరోపణలపై బీఆరెస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డికి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలపై ఠాగూర్ మధురై కోర్టును ఆశ్రయించారు.
కాగా తనకు ఠాగూర్ నోటీస్‌లు ఇవ్వడం పట్లపై ట్వీటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. “నోటీసులు ఎందుకు తప్పుగా ఇస్తున్నారు? ఠాగూర్ జీ అంటూ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం మీకు రేవంత్ రెడ్డి రూ.50కోట్లు లంచం ఇచ్చారని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారని, ఆన్ రికార్డుగానే ఆయన ఆరోపణలు చేశారన్నారు. పరువునష్టం నోటీసులు నాకు కాదు.. సచివాలయంలో కూర్చొన్న కోమటిరెడ్డికి పంపండని కేటీఆర్ ట్వీటర్‌లో పేర్కోన్నారు.