Site icon vidhaatha

Kumbam Anil | అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

విధాత: అకాల వర్షం, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbbam Anil) డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పంటలను అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు నష్టపోయిన పంటలను చూపిస్తూ అనిల్ కుమార్ రెడ్డి వద్ద కన్నీరు పెట్టుకోగా ఆయన రైతులను ఓదార్చారు.

వలిగొండ మండలంలోని మొగిలిపాక, తుర్కపల్లి గ్రామాలలో వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు అధైర్యపడే వద్దని, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, ఎంపీపీ నూతి రమేష్, నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి, పల్సం సతీష్, గరిసే రవి, కంకల కిష్టయ్య, బండారు నరసింహారెడ్డి, బద్దం సంజీవరెడ్డి, గుండు దానయ్య, కాసుల వెంకటేశం, కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version