Site icon vidhaatha

కేంద్రంలో బీజేపీ వస్తే రేవంత్ ప్రభుత్వానికి కష్టమే

విధాత : సీఎ రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటాడో చెప్పలేమని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఉంటుందో ఉండదో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జర్ఖండ్‌, ఢిల్లీ సీఎంల అరెస్టులను చూశామని, బీజేపీకి 400ఎంపీ సీట్లు వస్తే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కూడా ఏదో ఒక కుంభకోణం పెట్టి ప్రభుత్వాన్ని పడగొడుతారన్నారు.


మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే బీఆరెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం చేశారని, సీపీఐ ఉప ఎన్నికల్లో బీజేపీని ఆపినందునే ఎమ్మెల్యేల కొనుగోలుకు బ్రేక్‌లు పడ్డాయన్నారు. కేంద్రంలో బీజేపీకి భారీ మెజార్టీ వస్తే దేశంలోని ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ కష్టమేనని చెప్పారు. రేవంత్ ప్రభుత్వానికి కూడా ముప్పు తప్పదన్నారు. ఎవరు ఏ పార్టీలోకి ఎందుకు పోతున్నారో తెలియని గందరగోళం సాగుతుందని, రాజకీయ నాయకులకు విలువలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version