Megastar Chiranjeevi: డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అంతా చేయిచేయి కలిసినడుద్దామని మెగాస్టార్ చిరంజీకి పిలుపునిచ్చారు. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్టు హైదరాబాద్ మాదాపూర్ లో టీ.వర్క్స్ నుంచి మైహోం భూజ మీదుగా ఐటీసీ వరకు ఆదివారం మారథాన్ రన్ నిర్వహించారు. ఓరల్ క్యాన్సర్ పట్ల అవగాహాన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి వర్చువల్ సందేశం పంపించారు. వ్యసనాలకు బానిసలై కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడిపై ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్‌ను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.
ఓరల్ క్యాన్సర్ నివారణకు డ్రగ్స్, సిగరెట్, గుట్కా, పాన్ పరాగ్‌లకు దూరంగా ఉండాలని ఈ సందర్బంగా వైద్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి డాన్స్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్యక్రమంలో మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావుతో పాటు పలురంగాల ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు.