TGANB | తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) లో డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. 22 మంది స్పెషల్ పోలీసు ఆఫీసర్లను(డ్రైవర్లు) తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయనున్నట్లు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రకటనలో పేర్కొంది.
ఈ ఉద్యోగాలకు ఎక్స్ సర్వీస్‌మెన్, ఎక్స్ పారామిలటరీ పర్సన్స్, పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు అర్హులు అని తెలిపింది. ఇక 2026 జనవరి 31వ తేదీ నాటికి 58 ఏండ్లకు వయసు మించరాదు. గత రెండేండ్లలోనే పదవీ విరమణ పొంది ఉండాలి. ఎంపికైన వారికి గౌరవ వేతనం కింద నెలకు రూ. 26 వేలు చెల్లించనున్నారు. అర్హత గల వారు బంజారాహిల్స్‌లోని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కార్యాలయంలో సరైన ధృవపత్రాలతో ఫిబ్రవరి 4వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి.
