విధాత, హైదరాబాద్: మూడో భార్య రమ్య రఘుపతితో పాటు రోహిత్ షెట్టి ల నుంచి తనకు ప్రాణ హాని ఉండడంతో రయణ కోసం కోర్టును ఆశ్రయించానని నటుడు నరేష్ తెలిపారు. పైసా కట్నం లేకుండా అనంతపురానికి చెందిన రమ్యను 2010 మార్చి 3న మూడో వివాహం చేసుకున్నానని ఆయన వివరించారు.
మా అమ్మ స్వర్గీయ విజయనిర్మల, రమ్యకు రూ.30 లక్షల విలువ చేసే బంగారు నగలు కూడా చేయించిందన్నారు. పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే వేధింపులకు గురి చేస్తున్నదని, 2012లో తమకు రణవీర్ జన్మించారన్నారు. తనకు తెలియకుండా పలు బ్యాంకుల నుంచి, పరిచయస్తుల నుంచి లక్షల రూపాయల అప్పులు చేసిందన్నారు.
ఆమె చేసిన కొన్ని అప్పులు తీర్చానని, ఇవే కాకుండా రూ.50 లక్షల కూడా తీసుకుందన్నారు. నా ఆస్తి కాజేయాలనే దుర్బిద్ది పెంచుకున్నదని, ఒప్పుకోకపోవడంతో నన్నే చంపేందుకు సుఫారీ కూడా ఇచ్చిందన్నారు.
తనకు తెలిసిన పోలీసు అధికారి ద్వారా మొబైల్ ఫోన్ హ్యాకింగ్ చేరుకుని, తన ఫోన్ ను హ్యాక్ చేసి అన్ని చూసేదని ఆరోపించారు. రమ్య రఘుపతి వేధింపులు భరించలేకపోతున్నానని, విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరినట్లు నరేష్ వించారు. కన్నడ, తెలుగు నటి పవిత్రా లోకేష్ ను నరేష్ నాలుగో వివాహం చేసుకున్నట్లు సినిమా పరిశ్రమలో ప్రచారం జరుగుతున్నది.