Site icon vidhaatha

జగన్‌కు లోకేష్ అభినందనలు.. ఢిల్లీ నుంచి యువనేత కితకితలు

విధాత‌: చంద్రబాబు అరెస్ట్, రాజమండ్రి జైల్లో రిమాండ్ కు పంపిన నేపథ్యంలో జాతీయ పార్టీలను కలిసి మద్దతు కూడగట్టే నెపంతో పది రోజులుగా ఢిల్లీలో ఉంటున్న లోకేష్ జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తన తండ్రి జైల్లో ఉంటే లోకేష్ ఎందుకు అభినందనలు తెలిపాడు అనుకుంటున్నారా ? అదొక కథ.

గతంలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినా జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి ఆ తరువాత విడుదల అయ్యారు. అలా అయన విడుదల అయ్యి సరిగ్గా నేటికీ పదేళ్లు అయింది. ఆ సందర్భంగా పదేళ్ల సంబరాలు.. అభినందనలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇది కాస్త ఇరిటేటింగ్‌గా ఉన్నా గానీ సందర్భానుసారం స్పందించారని టిడిపి వాళ్ళు చెప్పుకుంటున్నారు.

మరోవైపు ఇటు వైసిపి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు.. వందలకోట్లు మింగిన తండ్రి జైల్లో ఉండగా కేసులకు భయపడిన లోకేష్ ఢిల్లీ పరార్ అయ్యారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా లోకేష్ ఢిల్లీలో తమ పార్టీ ఎంపీలతో సమావేశమవుతూ లోక్ సభలో వ్యవహరించాల్సిన తీరును వివరిస్తున్నారు. ఆంధ్రాలో అక్రమకేసులు పెట్టి చంద్రబాబును జైల్లో పెట్టిన విషయాన్నీ పార్లమెంట్ సాక్షిగా దేశం దృష్టికి తీసుకురావాలని అయన సూచించారు.

ఇదే అంశం మీద శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం ఢిల్లీలో మాట్లాడారు.. ఇక స్కిల్ స్కామ్ లో జైల్లో ఉన్న చంద్రబాబును ఈరోజు మొదటి రోజు సీఐడీ కష్టడీ ముగిసింది. డీఎస్పీ ధనుంజయ్ సారధ్యంలోని బృందం ఆయన్ను ప్రశ్నలతో విచారించింది. రేపు కూడా ఆయన్ను సీఐడీ ప్రశ్నిస్తుంది.

Exit mobile version