Site icon vidhaatha

Love | 28 ఏండ్ల వివాహిత‌తో.. 60 ఏండ్ల వృద్ధుడి ప్రేమ‌.. పెళ్లి..

Love | ప్రేమించుకోవ‌డానికి వ‌య‌సు అడ్డు కానే కాదు. ఏ వ‌య‌సులోనైనా ప్రేమించుకోవ‌చ్చు.. అనే దానికి ఈ ప్రేమ క‌థ‌నే నిద‌ర్శ‌నం. ఆమెకు 28 ఏండ్లు.. అత‌నికి 60 ఏండ్లు.. ఇరువురి మ‌ధ్య 40 ఏండ్ల వ‌య‌సు తేడా ఉన్న‌ప్ప‌టికీ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ భ‌దోహి జిల్లా బీహరోజ్‌పుర్‌కు చెందిన అష‌ర్ఫీ దేవి(28) కొన్నేండ్ల క్రితం కృష్ణ‌మూర‌త్ అనే వ్య‌క్తితో వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు జ‌న్మించారు. ఉపాధి నిమిత్తం కృష్ణ త‌మిళ‌నాడు వెళ్లాడు. అషర్ఫీ దేవి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి సొంతూర్లోనే ఉంటుంది.

ఈ క్ర‌మంలో అదే గ్రామానికి చెందిన రామ్ యాద‌వ్‌(60) తో దేవీకి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇటీవ‌లే ఇద్ద‌రూ పారిపోయారు. మూర‌త్ ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

రామ్ యాద‌వ్, దేవీల ఆచూకీ క‌నుగొని పోలీసులు స్టేష‌న్‌కు తీసుకొచ్చారు. తాను త‌న భ‌ర్త‌తో వెళ్ల‌న‌ని, రామ్‌తోనే ఉంటాన‌ని దేవీ తెగేసి చెప్పింది. చేసేదేమీ లేక మూర‌త్ కుటుంబ స‌భ్యులు స్టేష‌న్ నుంచి వెళ్లిపోయారు. ఇక స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న ఆల‌యంలోనే దేవీ, రామ్ పూల‌దండ‌లు మార్చుకుని వివాహం చేసుకున్నారు.

Exit mobile version