Site icon vidhaatha

Maharashtra | మూడు నెలల్లో 179 మంది చిన్నారుల మరణాలు.. రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ

Maharashtra |

విధాత: ఆ జిల్లాలో మూడు నెలల్లో 179మంది చిన్నారులు మృతి చెందారు. వైద్యులకు సవాల్‌గా మారుతున్న చిన్నారుల మరణాలపై మహారాష్ట్ర సర్కారు ఆలస్యంగానైనా మేల్కోంది. నందుర్‌బార్ జిల్లాలో జూలై నెలలో 75మంది, ఆగస్టులో 86మంది, సెప్టెంబర్‌లో ఇప్పటికే 18మంది మృతి చెందారు. మరణించిన చిన్నారుల్లో ఎక్కువగా 0-28రోజుల వయసున్న పిల్లలే కావడం గమనార్హం.

చిన్నారుల మరణాలను సవాల్‌గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మిషన్ లక్ష84పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఆరంభించింది. పిల్లల మరణాలకు తల్లులలోని పోషకాహార లోపం, ఇంటి ప్రసవాలు, సరైన వైద్య వసతులు లేకపోవడం వంటి వాటిని గుర్తించారు.

ముఖ్యంగా నందూర్‌బార్ జిల్లాలో గిరిజన జనాభా అధికంగా ఉండటం, స్త్రీలలో సీకెల్ సెల్ ఎనీమియా లక్షణాలు ఉండటం కూడా పిల్లల మరణాలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, పుట్టుకలో వచ్చే ఆస్పీక్సియా, సెప్పిస్‌, శ్వాసకోశ వ్యాధులు ప్రాథమిక కారణాలుగా ఉన్నాయంటున్నారు.

మిషన్ లక్ష 84లో భాగంగా ప్రసవానికి ముందు 42రోజులు, తర్వాతా 42రోజులు పోషకాహారం, వైద్య సేవల్ని మెరుగుపరుచడం వంటి చర్యలతో తల్లిబిడ్డల ఆరోగ్య రక్షణ చర్యలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టారు.

Exit mobile version