- సాయిబాబ విడుదలపై మళ్లీ సుప్రీంను ఆశ్రయించిన మహారాష్ట్ర ప్రభుత్వం
- ముంబై హైకోర్టు మార్చ్ 5 న సాయిబాబా విడుదల ఆదేశం
- సాయిబాబా విడుదల పై రెండవ సారి సుప్రీం కోర్టు కెక్కిన మహారాష్ట్ర ప్రభుత్వం
- తీవ్ర అనారోగ్య సమస్యలతో నడువలేని కఠిన పరిస్థితుల్లో వీల్- చైర్ కే పరిమిత మైన సాయిబాబా
ముంబై : ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబను విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టుకెక్కింది. 2012 లో అప్పటి బీజేపీ ప్రభుత్వం సాయిబాబపై అర్బన్ నక్సలైట్ అనే ఆరోపణలతో అరెస్టు చేసింది. ఆ తరువాత నాగపూర్ సెంట్రల్ జైల్లో నిర్భందించింది. అప్పటి నుండి ఆయన జైల్లోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా 2017 లో గడ్చీరోలీ జిల్లా సెషన్స్ కోర్టు సాయిబాబాబతో పాటు అతని అనుచరులైన మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పును 2022 అక్టోబర్ 14 న బాంబే హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షను కొట్టి వేస్తూ అతన్ని విడుదల చేయాలని తీర్పు వెల్లడించింది.
దీంతో కోర్టు తీర్పును వ్యతిరేకించిన ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించింది. దీంతో సాయిబాబను మళ్లీ జైలుకు పంపారు. కేసును పునఃపరిశీలించిన బాంబే హైకోర్టు తాజాగా మంగళవారం సాయిబాబను నిర్ధోషిగా తీర్పు వెల్లడించింది. అయితే ఈ సారి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ తిరిగి సుప్రీంను ఆశ్రయించడంతో చర్చనియాశం అయింది. అయితే బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తున్నదని, కావాలనే సాయిబాబపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని పలువురు సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు.