- సహకారం అందించాలన్న రవి
- సన్మానించిన సంపత్
విధాత: నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించిన మల్లు రవి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ కమార్ ఇంటికి వెళ్లి కలిశారు. తన ఇంటికి వచ్చిన రవిని సంపత్ కుమార్ సాధరంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్‌లో గెలుపు కోసం తనకు సహకారం అందించాలని కోరారు. గెలుపు కోసం సహకారం అందిస్తానని సంపత్ కుమార్ మల్లురవికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ విజయానికి చేయాల్సిన వ్యూహం పై చర్చించారు. అనంతరం ఇద్దరు నాయకులు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి జూపల్లి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో సుధీర్ఘంగా చర్చించారు. నాగర్ కర్నూల్ లో విజయం సాధించేందుకు ఏమా చేయాలన్న అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి నాయకులకు దిశా నిర్దేశం చేశారు.