విధాత: ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైలు కింద పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజు పల్లి గ్రామానికి చెందిన బొజ్జ సైదులు( 35 )ఆర్థిక ఇబ్బందులతో
జీవితంపై విరక్తి చెంది రాయని గూడెం సమీపంలో మంగళవారం రైలు కిందపడి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు . ఈ ఘటనపై రైల్వే పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.