Site icon vidhaatha

భారీ కింగ్ కోబ్రాతో వ్య‌క్తి సాహ‌స క్రీడ‌.. ట్రోఫీని ఎత్తిన‌ట్టు ఎత్తాడుగా!

విధాత: కొంద‌రికి పాముల‌ను చూస్తేనే భ‌యం! అది విష‌పూరిత‌మా? కాదా? అనే సంగ‌తి ప‌క్క‌నపెట్టి దాన్ని చంపేంత వ‌ర‌కూ ఊరుకోరు! మ‌రికొంద‌రు అత్యంత విష‌పూరిత‌మైన పాముల‌తో సైతం సాహ‌స‌క్రీడ‌లు ఆడుతూ ఉంటారు. కొన్ని సంద‌ర్భాల్లో అవి కాటు వేసి.. మ‌ర‌ణించిన‌వారూ, చావు అంచుల దాకా వెళ్లి బ‌య‌ట‌ప‌డిన‌వారూ ఉన్నారు. మ‌ళ్లీ ఎందుకు? అంటే.. అది త‌మ ప్యాష‌న్ అంటారు! అలాంటి ఔత్సాహిక సాహిస‌కుడే ఆకాశ్ జాద‌వ్! భారీ కింగ్ కోబ్రాతో ఆయ‌న చేసిన సాహ‌సాల వీడియో చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రించిపోవ‌డం ఖాయం. ట్రోఫీని ఎత్తిన‌ట్టు కింగ్ కోబ్రాను ఎత్తిన తీరు చూస్తే సాహో అనాల్సిందేనంటున్నారు నెటిజ‌న్స్‌. సాహ‌సాల్లో ఇంతకు మించిన సాహ‌సం ఉండబోదేమోన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వీడియోలో ఆకాశ్ జాద‌వ్ ప‌ట్టుకున్న‌ది మామూలు పాము కాదు. అత్యంత విష‌పూరిత‌మైన స‌ర్పాల్లో ఒక‌టి. త‌న‌కంటే రెండింతలు పొడ‌వు ఉన్న ఆ పాము.. బుద్ధిగా ఒద్దిక‌గా ఆయ‌న చేతిలో ఇమిడిపోయింది. చేతుల‌కు ఎలాంటి ర‌క్ష‌ణ క‌వ‌చాలు లేకుండా, ఎలాంటి క‌ర్ర‌లు ఉప‌యోగించ‌కుండా ఆయ‌న ఈ పామును చేతుల్లోకి తీసుకుని.. గాలిలోకి ఎత్తాడు. నిజానికి కింగ్ కోబ్రా కాటు వేసిందంటే ఆ మ‌నిషికి వెంట‌నే త‌గిన చికిత్స అందించ‌కుంటే గంట‌ల్లోనే మృత్యు ఒడిని చేర‌డం ఖాయం. అది తెలిసి కూడా ఆకాశ్ జాద‌వ్ కింగ్ కోబ్రాతో ఆట‌లాడిన తీరుపై సామాజిక మాధ్య‌మాల్లో మిశ్ర‌మ స్పంద‌న‌లు వెలువ‌డ్డాయి. కొంద‌రు ఆయ‌న సాహ‌సాన్ని కీర్తిస్తే.. మ‌రికొంద‌రు ఆయ‌న‌కు ఏమైనా అవుతుందేమోన‌న్న ఆందోళ‌న వెలిబుచ్చారు.

స‌ర్ప మిత్ర అయిన ఆకాశ్ జాద‌వ్ మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌కు చెందిన‌వారు. పొర‌పాటున జానావాసాల్లోకి వ‌చ్చిన‌ పాముల‌ను భ‌ద్రంగా కాపాడి.. తిరిగి అట‌వీ ప్రాంతాల్లో సుర‌క్షితంగా విడుద‌ల చేస్తుంటారు. ఆయ‌న ఇన్‌స్టా sarpmitra.akashjadhav25 ఎకౌంట్‌లోకి వెళ్లి చేస్తూ నివ్వెర‌బోయే మ‌రిన్ని సాహ‌సాలు కూడాగ‌మ‌నించ‌వ‌చ్చు. కానీ.. అకాశ్ జాద‌వ్ పాముల‌ను ప‌ట్టుకోవ‌డంలో నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తి.. ఎవ‌రు ప‌డితే వారు ఇలా పాముల‌తో ఆట‌లాడుకుంటే.. ప్ర‌మాదం అన్న సంగ‌తి గుర్తు పెట్టుకుంటే మంచిది.

Exit mobile version