Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గిరిజనేతరులకు ఎస్టీ హోదా కల్పించొద్దని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ రిజర్వేషన్ల అంశం రెండు వర్గాల మధ్య మంటలను రాజేసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
అసలేం జరిగిందంటే..?
మణిపూర్ జనాభాలో 40 శాతంగా ఉన్న మైతీ తెగకు ఎస్టీ హోదా కల్పించాలని ఆ రాష్ట్ర హైకోర్టు గత నెలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని 53 శాతంగా ఉన్న గిరిజన తెగలు జీర్ణించుకోలేదు. హైకోర్టు ఆదేశాలను తీవ్రంగా ఖండించారు గిరిజనులు.
My state Manipur is burning, kindly help @narendramodi @PMOIndia @AmitShah @rajnathsingh @republic @ndtv @IndiaToday pic.twitter.com/VMdmYMoKqP
— M C Mary Kom OLY (@MangteC) May 3, 2023
మంటలు రాజేసిన గిరిజన సంఘీభావ ర్యాలీలు..
హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ 10 పర్వత ప్రాంత జిల్లాల్లో గురువారం గిరిజన సంఘీభావ ర్యాలీలు చేపట్టింది. ఈ ర్యాలీలు మంటలను రాజేశాయి. కొంత మంది గిరిజన యువకులు.. మైతీ తెగ ప్రజలపై దాడులు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హింసాత్మక పరిస్థితి ఏర్పడింది.
చాలా దుకాణాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. మైతీ తెగ ప్రజలు కూడా గిరిజన నివాసాలపై దాడులు చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. హింసకు సంబంధించి తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మణిపూర్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. అదనపు పారా మిలటరీ బలగాలను మణిపూర్‌కు పంపింది. ఇప్పటి వరకు హింసాత్మక ప్రాంతాల నుంచి 9 వేల మంది ప్రజలను సైన్యం రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించింది.
Within just 15 months of the BJP forming the government, #Manipur is burning & crying for help