Site icon vidhaatha

మెదక్: AICCలోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు

విధాత, ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలకు (ఏఐసీసీ) ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో స్థానం దక్కింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిలను ఏఐసీసీ సభ్యులుగా పార్టీ అధిష్టాన వర్గం నియమించింది.

అంతే కాకుండా నారాయంఖేడ్ మాజీ ఎమ్మెల్యే, సురేష్ శెట్కర్‌ను ఏఐసీసీ కోప్టెడ్ సభ్యునిగా నియమించారు. హాథ్ సే హాథ్ జోడో నియోజకవర్గాలలో సమన్వయకర్తలుగా పీసీసీ ప్రధాన కార్యదర్శులను పీసీసీ అధిష్టాన వర్గం నియమించింది. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పీసీసీ అధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమం అమలు చేసేందుకు నాయకుల మధ్య సమన్వయం చేస్తూ కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు ఈ సమన్వయకర్తలు పనిచేస్తారు.

పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాలు చేస్తున్నారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలలో డీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, తూము కుంట నర్సారెడ్డి, నిర్మలా జయప్రకాష్ రెడ్డి అధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాదయాత్ర ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చొచ్చు కెలుతున్నారు. పాదయాత్రలో సమస్యలు తెలుసుకుంటున్నారు. నర్సాపూర్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి అవుల రాజిరెడ్డి అధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమ సమన్వయకర్తలుగా పీసీసీ ప్రధాన కార్యదర్శులను నియమించారు. సిద్దిపేటకు కే.మానవతా రాయ్, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు నర్సారెడ్డి భూపతి రెడ్డి, సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గానికి బి హర్షకుమార్,

దుబ్బాక నియోజకవర్గానికి జే, జయపాల్, జహీరాబాద్ నియోజక వర్గానికి బొల్లు కిషన్, గజ్వేల్ నియోజకవర్గానికి పి.ప్రమోద్ కుమార్, నారయణ ఖేడ్ నియోజకవర్గానికి అల్గేటి మధుసూదన్ రెడ్డిలను నియమించారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజక వర్గాల నాయకులను కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయనున్నారు.

Exit mobile version