ఎవరడ్డుకున్నా.. వెనక్కి తగ్గేది లేదు.. ‘మెదక్’ అభివృద్దే ధ్యేయం: మైనంపల్లి రోహిత్

మెదక్‌లో భారీ ర్యాలీ.. అంగు ఆర్భాటంతో రోహిత్ పొలిటికల్ ఎంట్రీ  భారీగా తరలి వచ్చిన యువకులు.. సర్వమత ప్రార్థనలు మెదక్ అభివృద్దే ధ్యేయంగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందనీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ అన్నారు. శుక్రవారం ఆయన భారీ కాన్వాయ్ తో మెదక్ కు చేరుకొని రాందాస్ చౌరస్తాలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. […]

  • Publish Date - April 7, 2023 / 01:55 PM IST

  • మెదక్‌లో భారీ ర్యాలీ.. అంగు ఆర్భాటంతో రోహిత్ పొలిటికల్ ఎంట్రీ
  • భారీగా తరలి వచ్చిన యువకులు.. సర్వమత ప్రార్థనలు
  • మెదక్ అభివృద్దే ధ్యేయంగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందనీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ అన్నారు. శుక్రవారం ఆయన భారీ కాన్వాయ్ తో మెదక్ కు చేరుకొని రాందాస్ చౌరస్తాలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ నియోజక వర్గంలో మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను గ్రామగ్రామాన విస్తరిస్తామని అన్నారు. ఎవరు అడ్డుకున్నా వెనక్కి తగ్గేది లేదని అన్నారు.

మెదక్ అభివృద్ధిలో ఎవరు అడ్డుపడ్డ వెనుకడుగు వేయనని మెదక్ ను అభివృద్ధి చేయడమే తన ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు. చిన్న శంకరం పేట నుంచి మెదక్ రాందాస్ చౌరస్తా వరకు కార్, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో రోహిత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లైంది.

రాందాస్ చౌరస్థాలో శివాజీ విగ్రహానికి పులమాలలు వేసి, అనంతరం రామాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీసాయి బాలాజీ గార్డెన్లో మైనార్టీలకు రంజాన్ సందర్భంగా వెయ్యి మందికి గిఫ్ట్ ప్యాకెట్లు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద వారికి సహాయం, మెదక్‌ను అభివృద్ధి పరచాలని ఉద్దేశ్యంతో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు వెళ్తామని రోహిత్ తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో గల్లి గల్లి తిరుగుతూ ముందుకు పోతామన్నారు.

తన ఆర్గనైజేషన్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఒక పాఠశాలను అభివృద్ధి పరచాలన్న ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నామన్నారు. అంతకుముందు యువకులు చౌరస్తాలో గజమాలతో సన్మానించారు. పిల్లి కోటల నుండి బోధన్ చౌరస్తా వరకు భారీ హోల్డింగులు పెట్టారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కోండన్ సురేందర్ గౌడ్, అరునార్తి వెంకటరమణ మున్సిపల్ మాజీ చైర్మన్ చల్ల నరేందర్,అనిల్ కుమార్, ముజీబ్,చిన్న శంకరం పెట్ సర్పంచ్ రాజి రెడ్డి, ఉప్పల రాజేష్, భారీ సంఖ్యలో వివిధ మండలాల నుండి తెరాస నాయకులు, కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు.

Latest News