Site icon vidhaatha

నిజామాబాద్‌: మెడికో ఆత్మహత్య.. ఘటనపై బంధువుల అనుమానం

విధాత, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష (22) హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి భోజనం చేసిన హర్ష గదిలోకి వెళ్ళగా శనివారం ఉదయం ఉరేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు.

కాగా.. విద్యార్థి ఆత్మహత్యపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామం కాగా అతని తండ్రి శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version