Mega DSC | 6,100పోస్టులకు మెగా డీఎస్సీ.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం

ఏపీ క్యాబినెట్ ఒకేసారి 6,100పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ వేయాలని నిర్ణయం తీసుకుంది

  • Publish Date - January 31, 2024 / 09:12 AM IST

Mega DSC | విధాత : ఏపీ క్యాబినెట్ ఒకేసారి 6,100పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ నిర్ణయంతో శుభవార్తను అందించినట్లయ్యింది. అలాగే పలు కీలక నిర్ణయాలను సైతం ఏబీ క్యాబినెట్ తీసుకుంది. వైఎస్సార్ చేయూత నాల్గవ విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5వేల కోట్ల మేరకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో 22వేల కోట్ల పెట్టుబడులకు సైతం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం క్యాబినేట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నది.

Latest News