- రూ.1,867 కోట్ల విలువైన మందుగుండు
- సామగ్రి సరఫరాకు ఒప్పందం
- రియాద్‌లో ప్రపంచ రక్షణ ప్రదర్శనలో
- ఇరు దేశాల ప్రతినిధుల సంతకాలు
విధాత: భారతదేశ రక్షణశాఖ పతార మరింత పెరిగింది. భారత్ అతిపెద్ద మందుగుండు సామగ్రి కోసం సౌదీ అరేబియా ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీని విలువ రూ.1,867 కోట్లు. ఇందుకు రియాద్‌లో జరుగుతున్న ప్రపంచ రక్షణ ప్రదర్శన (WDS) వేదిక అయింది. భారతీయ రక్షణశాఖ ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసే మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) సౌదీ అరేబియాకు ఫిరంగి మందుగుండు సామగ్రి సరఫరా చేయనున్నది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య రూ.225 మిలియన్ డాలర్ల (రూ. 18,67,38,75,000) విలువైన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఎంఐఎల్ భాగస్వామి అయిన నద్రాహ్ కంపెనీ రియాద్‌లో జరుగుతున్న ప్రపంచ రక్షణ ప్రదర్శనలో అధికారికంగా సంతకం చేసింది. కార్యక్రమంలో సౌదీ అరేబియాలోని జనరల్ అథారిటీ ఆఫ్ మిలిటరీ ఇండస్ట్రీస్ గవర్నర్ అహ్మద్ అబ్దుల్ అజీజ్ అల్-ఓహలీ, భారత రక్షణ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య ఇటీవలి ద్వైపాక్షిక సైనిక విన్యాసాల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. అతిపెద్ద భారత రక్షణ ఎగుమతి ఆర్డర్లలో ఇది ఒకటి. భారతదేశంలోని రక్షణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన మ్యూనిషన్ ఇండియా, భారత్ తొలి 155 స్మార్ట్ మందుగుండు సామగ్రిని అభివృద్ధి చేయడానికి ఐఐటీ-ఎం తో కలిసి పనిచేస్తున్నది.