Site icon vidhaatha

Errabell Cell Phone Missing | మంత్రి ఎర్రబెల్లి సెల్లు పోయింది

Errabell Cell Phone Missing, విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar Rao) సెల్ ఫోన్(Cell Phone) జారిపడిపోయింది. ఎవరో భక్తుని చేతిలో పడింది. మంత్రి సెల్ పోయింది, దొరికిన వాళ్ళు ఇవ్వాలని దేవస్థానం సిబ్బంది మైకులో పదే పదే ప్రకటించారు.

ఈ సంఘటన జనగామ(Janagama) జిల్లా చిల్పూర్ మండలం చిల్పూర్ గుట్ట బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానం(Chilpur Gutta Bugulu Venkateswara Swamy Devasthanam)లో శుక్రవారం జరిగింది. బుగులు వేంకటేశ్వర స్వామి, పద్మావతిదేవిల కల్యాణ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. గుట్టపైన మూల విరాట్టు దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని కాలినడకన వెళ్లారు.

తోసుకొచ్చిన భక్తులు

కళ్యాణ వేదిక వద్ద ఒక్కసారిగా భక్తులు తోసుకురావడంతో మంత్రి జేబులోని మొబైల్ ఫోన్ కింద పడింది. ఒక భక్తుని చేతిలో పడింది. మంత్రి కొద్దీ సమయం కల్యాణ వేడుకల్లో పాల్గొని బయలుదేరే సమయంలో సెల్ పోయిందని గుర్తించారు. మంత్రి ఫోన్ పోయిందని, భక్తులు ఎవరికైనా దొరికితే తెచ్చి ఇవ్వాలని దేవస్థానం అధికారులు మైక్ సెట్ ద్వారా కోరారు. 20 నిమిషాల తరువాత ఒక భక్తుడు ఫోన్ దొరికిందని సీఐ సంతోష్ కుమార్(CI Santhosh Kumar)కు ఇవ్వడంతో ఆయన వెళ్లి మంత్రికి అందచేశారు.

Exit mobile version