- దాడులను ఖండించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బాల వికాస (Balavikasa) పై ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) తెలిపారు. గత 25, 30 ఏళ్లుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థపై దాడులు బాధాకరమన్నారు. క్రిస్టియన్ మిషనరీ సంస్థ (Christian missionary organization) అవడం వల్లే చేసిన ఈ ఐటీ దాడులు కక్ష్యసాధింపు చర్యలేనని విమర్శించారు.
లౌకిక, ప్రజా స్వామికి దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఇలాంటి దాడులతో బాల వికాస లాంటి సంస్థల నిస్వార్థ ప్రజా సేవలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భయబ్రాంతులకు గురిచేయడం ద్వారా ఆ సంస్థ సేవలను అపగలమా? అంటూ ఎందరో ప్రముఖులు ప్రశంసించిన బాల వికాస సంస్థ పై ఐటీ దాడులు అవమానకరమని ఎర్రబెల్లి అన్నారు.