విధాత: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి భేరీజు వేసుకుని కేంద్ర మంత్రులు మాట్లాడాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ శక్తి కార్నర్ల సమావేశాల్లో కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.
కేసీఆర్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. కార్నర్ మీటింగులు పెట్టె బీజేపీ నాయకులు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చూడండన్నారు. కేంద్ర మంత్రుల సొంత ఊళ్ళల్లో తెలంగాణ మార్క్ అభివృద్ధి చేసినాక మాట్లాడాలన్నారు.
— Jagadish Reddy G (@jagadishBRS) February 27, 2023
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు బంధు, రైతు భీమా, 24 గంటల విద్యుత్ ఉన్నాయా అని నిలదీశారు. కార్నర్ మీటింగులల్లో అబద్దాలు చెప్పి బీజేపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారన్నారు. బీజేపీ కుయుక్తులు చైతన్య వంతమైన తెలంగాణ సమాజం ముందు సాగవని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.