Site icon vidhaatha

Suryapeta: అభాగ్యుడికి అండగా అమాత్యులు.. చికిత్స బాధ్యత తీసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: పేదలు, ఆపన్నులకు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుండే సూర్యాపేట శాసన సభ్యుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి(Jagadeesh Reddy) మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 6 ఏళ్ల క్రితం తీవ్ర జ్వరంతో కాళ్లు చేతులు పడిపోయి వీల్ చైర్‌కే పరిమితమై అచేతనంగా ఉన్న గుర్రం నారాయణ రెడ్డి(Narayana Reddy) చికిత్స బాధ్యత తీసుకున్నారు.

నారాయణరెడ్డి స్వగ్రామం ఆత్మకూర్ ఎస్ మండలం దాచారం. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం గ్రామానికి వెళ్ళిన మంత్రి వీల్ చైర్‌లో ఉన్న నారాయణరెడ్డిని గమనించారు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి ఇంతకాలం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అంటూ స్థానిక నేతలను సున్నితంగా మందలించారు. నారాయణరెడ్డి చికిత్స బాధ్యత తనదే అంటూ అభయమిచ్చారు.

నారాయణరెడ్డిని హైదరాబాద్‌కు తరలించి వెంటనే చికిత్స ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి అని తన సిబ్బందిని ఆదేశించారు. పెళ్లి కావాల్సిన కూతురు ఉండి, కుటుంబ పెద్ద మంచాన పడి, దిక్కు తోచని స్థితిలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రికి బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు

Exit mobile version