Site icon vidhaatha

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: మంత్రి కోమటిరెడ్డి


విధాతౠ హైదరాబాద్‌ : సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత నివ్వాలని శాసన మండలిలో బీఆరెస్‌ ఎమ్మెల్సీ కవిత కోరారు. గత ప్రభుత్వం సచివాలయం ఆవరణలో తెలంగాణ త‌ల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, అదే స్థలంలో ఇప్పుడు ప్రభుత్వం రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన పట్ల గౌరవం ఉందని, అయితే తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకయైన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కూడా ముఖ్యమన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించాలని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లిని చూస్తే కిరిటాలు..నగలు, వజ్రాభరణాలు కాకుండా గ్రామీణ వాతావరణం ఉట్టి పడాలని, చాకలి ఐలమ్మ స్ఫూర్తికి. అందుకే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చాలని చూస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడే దిశగా సాగుతున్నాయన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై నిర్ణయం జరిగాక విగ్రహ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గాంధీ కుటుంబం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిందని, అందుకే వారి విగ్రహాలు పెడుతున్నామన్నారు. గద్దర్ పేరు మీద అవార్డు ఇస్తున్నామని, రెండు రోజుల్లో గద్దర్ అవార్డు కమిటీ ఏర్పాటు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.


అంతకుముందు కవిత మాట్లాడుతూ వేరు శనగ పంటకు క్వింటాలుకు రూ.6377 కనీస మద్దతు ధర ఉండగా… వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రూ. 5 వేలలోపు కొనుగోలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులను వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వేరుశనగ పంటకే కాకుండా అన్ని పంటలకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర ఉంటే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధర కల్పిస్తారా లేదా బోనస్ ఇస్తారా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.

Exit mobile version