TSPSC: పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌ PA.. వంద మందికి వందకు పైగా మార్కులు: రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు

విధాత: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పీఏ సొంత మండలం మాల్యాలలో వంద మంది అభ్యర్థులకు వందకు పైగా మార్కులు వచ్చాయన్నారు. దీనిపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నాకు వచ్చిన సమాచారం ఎప్పుడూ తప్పు కాదన్నారు. పేపర్ లీకేజీ కేసులోని ప్రభుత్వంలోని పెద్ద తలకాయలను కాపాడేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారన్నారు. ఎన్ ఎస్ యు ఐ […]

  • Publish Date - March 18, 2023 / 09:59 AM IST

విధాత: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పీఏ సొంత మండలం మాల్యాలలో వంద మంది అభ్యర్థులకు వందకు పైగా మార్కులు వచ్చాయన్నారు. దీనిపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నాకు వచ్చిన సమాచారం ఎప్పుడూ తప్పు కాదన్నారు.

పేపర్ లీకేజీ కేసులోని ప్రభుత్వంలోని పెద్ద తలకాయలను కాపాడేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారన్నారు. ఎన్ ఎస్ యు ఐ నేత బల్మూరి వెంకట్ కోర్టులో వేసిన కేసు నేపథ్యంలో తాము సిట్ వేశామని దర్యాప్తు జరుగుతుందని చెప్పుకోవడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.

30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న పేపర్ లీకేజీ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకోకుండా విచారణ జరుపుతూ ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అని చెబుతూ కేటీఆర్ ప్రభుత్వంలోని పెద్దలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు తమ నిజాయితీలను నిరూపించుకోవాలని సూచించారు.

Latest News