Site icon vidhaatha

పార్టీ పేరు మారింది.. కానీ డీఎన్ఏ మార‌లేదు : మంత్రి కేటీఆర్

Minister KTR | భార‌త రాష్ట్ర స‌మితి అని పేరు మారింది.. కానీ డీఎన్ఏ మార‌లేదు అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మికుంట‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లో కూడా గులాబీ జెండా, మ‌న నాయ‌కుడు ద‌మ్ము చూపెట్టే అవ‌స‌రం ఉన్న‌దని కేటీఆర్ తెలిపారు. అక్క‌డ కూడా జెండా పాతే అవ‌స‌రం ఉన్న‌ది కాబ‌ట్టి పార్టీ పేరు మారింది. పేరు మారింది. కానీ డీఎన్ఏ మార‌లేదు. నాయ‌కుడు మార‌లేదు. గుర్తు మార‌లేదు. రంగు మార‌లేదు. జెండా మార‌లేదు. ఎజెండా మార‌లేదు. దేవుడితోనైనా కొట్లాడేదే మ‌న ఎజెండా అని స్ప‌ష్టం చేశారు.

మొన్న జ‌రిగిన పొర‌పాటు మ‌ళ్లీ భ‌విష్య‌త్‌లో హుజురాబాద్‌లో జ‌ర‌గొద్దు. రాబోయే ఏడెనిమిది నెల‌ల్లో హుజురాబాద్ గ‌డ్డ మీద క‌చ్చితంగా గులాబీ జెండా ఎగిరే విధంగా ఒక క‌సితో, క‌మిట్‌మెంట్‌తో కౌశిక్ రెడ్డి నేతృత్వంలో బ్ర‌హ్మాండంగా మీరంద‌రూ ప‌ని చేయాలి. కౌశిక్ రెడ్డి అడిగిన నిధులు తప్ప‌కుండా ఇస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

రాబోయే 8 నెల‌ల పాటు ప్ర‌జ‌ల్లోనే ఉండు. జ‌నంలోనే ఉండు. జ‌నంలోనే తిరుగు అని కౌశిక్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదం మ‌న‌కు త‌ప్ప‌కుండా ఉంటుంది. బండి సంజ‌య్, ఈట‌ల రాజేంద‌ర్ కొత్త కొత్త వేషాలు, పంచాయ‌తీలు, చిచ్చు పెట్టే రాజ‌కీయాలు చేస్తారు. ఎవ‌రికి ఓటేస్తే హుజురాబాద్ అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటేయండి. ఆగం కావొద్దు. సెంటిమెంట్ డైలాగుల‌కు ప‌డిపోవ‌ద్దు అని మ‌న‌వి చేస్తున్నట్లు కేటీఆర్ ప్ర‌క‌టించారు.

Exit mobile version