Site icon vidhaatha

Niranjan Reddy । దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించింది: మంత్రి నిరంజన్‌రెడ్డి

విధాత: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఈడీ నోటీసులు బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలకు పరాకాష్ఠ అని మంత్రి నిరంజన్‌రెడ్డి (Minister Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనలేక కవితపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించి, వాటి విశ్వసనీయతను దెబ్బతీసిందని అన్నారు.

ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులు, కేసులు అంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అదానీ (Adani) గురించి కేంద్రం ఎందుకు నోరు మెదపదు? ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు దర్యాప్తు చేయవు? అని మంత్రి నిరంజన్‌రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యేలను కొని బీజేపీ అక్రమంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసింది నిజం కాదా? అని ఆయన నిలదీశారు. ‘మాట వినని వారిపై కేసులు పెడుతున్నారు. దారికి వచ్చిన వారిపై దయ చూపిస్తున్నారు. మేఘాలయ ఎన్నికల ప్రచారంలో సీఎం సంగ్మాపై అవినీతి ఆరోపణలు చేయలేదా? ఎన్నికల అనంతరం సంగ్మాకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు.

Exit mobile version