అధికారంతో పాటు విచక్షణ కోల్పోయారు: మంత్రి పొన్నం ప్రభాకర్‌

బీఆరెస్ నేతలు అధికారంతో పాటు విచక్షణ కోల్పోయి రెండు రోజుల కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.

  • Publish Date - December 10, 2023 / 10:25 AM IST

  • అందుకే రెండు రోజుల కొత్త ప్రభుత్వంపై విమర్శలు
  • బీఆరెస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్‌


విధాత : బీఆరెస్ నేతలు అధికారంతో పాటు విచక్షణ కోల్పోయి రెండు రోజుల కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని బీసీ సంక్షేమ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో ఆయన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తుక్కుగుడ విజయభేరీ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 హామీల్లో రెండు అమలు చేశామన్నారు. తొమ్మిది వేల కు పైగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ప్రతి రోజు 45 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారన్నారు.


నా శాఖ పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం చాలా సంతోషం గా ఉందన్నారు. గత పాలనలో ప్రజలకు సెక్రటేరియట్, ప్రగతి భవన్ లోకి అనుమతి లేకుండా పోయిందని, వాటిని పూర్తిగా మార్చామన్నారు. ప్రజల సమస్యలు వినడానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాదర్బార్‌ను జిల్లాలకు విస్తరిస్తామన్నారు. శాసన సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరడం జరిగిందన్నారు.


టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ 6 గ్యారంటీ లను ప్రకటించినప్పుడు అవి అమలయ్యేవి కాదంటూ బీఆరెస్‌, బీజేపీలు ప్రజలను తప్పుదోవ పట్టించాయన్నారు. గ్యారంటీలు ఇచ్చాం అమలు చేస్తాం అని మాట ఇచ్చి వాటిని నిర్ధేశిత వంద రోజుల్ల అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ కు ఉన్న కమిట్ మెంట్‌కు రెండు గ్యారంటీల అమలు నిదర్శనమన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏకఛత్రాధిపత్యంగా ఉండదన్నారు. ఆటో డ్రైవర్ ల బాధల గురించి చర్చిస్తామని, వారి బాధలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అన్ని సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ విలీన పక్రియలో ఆస్తులు వేరు వేరుగా పెట్టారని, రద్దు అయిన సంఘాలను కూడా చర్చలకు ఆహ్వానిసస్తామన్నారు. వారి సూచనలు, సలహాలు తీసుకుంటామని, ఆర్టీసీని నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటామన్నారు.

Latest News