- నిమ్స్ బ్రాండ్‌ను ముందుకు తీసుకెలుతాం
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ
విధాత: తెలంగాణలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి వచ్చే 20ఏళ్లతో కూడిన విజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం నిమ్స్‌లో నూతనంగా నిర్మించిన డీఎస్ఏ, సీపీఆర్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మెడికల్ టూరిజంతో పాటు హెల్త్ ఎడ్యుకేషనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని, హైదరాబాద్‌లోని నిమ్స్‌కు జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్‌ను మరింత ముందుకు తీసుకెలుతామన్నారు.
రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆసుపత్రితో పాటు నిమ్స్ ఆస్పత్రి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రానికి హెల్త్ డెస్టినేషన్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును రావడానికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 300 మంది స్టాప్ నర్సులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ, విభాగదీపతి సాయి సతీష్, యూఎస్‌ఏఐడీ డాక్టర్ వర ప్రసాద్, నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.