Minister Srinivas Goud |
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: బీఆర్ఎస్ హయాంలో పాలమూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేసిన నిధులను అందజేశారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ సమీప ఆంజనేయ దేవాలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.5 లక్షల ప్రొసీడింగ్ ను అందజేశారు. టీచర్స్ కాలనీలోని మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, పాతతోటలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.30 లక్షలు, హనుమాన్ దేవాలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.10 లక్షల ప్రొసీడింగ్స్ ను అందజేశారు.
అనంతరం మట్టి తో చేసే వినాయక కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. మూడో సారి ఎన్నికల బరిలో ఉంటున్నానని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని మంత్రి అన్నారు.