Site icon vidhaatha

కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టు అప్పగించలేదు.. అప్పగింబోం


విధాత, హైదరాబాద్ : కృష్ణ బోర్డుకు మేం ఏ ప్రాజెక్టును అప్పగించలేదని, భవిష్యత్తులోనూ అప్పగించబోమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా బీఆరెస్ ఎమ్మెల్యేలు కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన సమావేశ మినిట్స్‌ను వినిపించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ తాము కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టులను అప్పగించలేదని, సభా సాక్షిగా దీనిపై తాను స్పష్టం చేస్తున్నానని, సమావేశ మినిట్స్‌లో కూడా అదే అంశం ఉందన్నారు.


బీఆరెస్ ఎమ్మెల్యేలు ఎక్కడినుండో మినిట్స్ తెచ్చి సమాధానం చెప్పు అని అంటే ఎలా అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై వచ్చిన వివాదానికి గత ప్రభుత్వమే కారణమని, కృష్ణా నదిలో వాటా వదులుకున్నది బీఆరెస్‌ ప్రభుత్వమేనని అన్నారు. కేసీఆర్ హాయంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఏపీకి తరలిపోతున్న నీటి ఒప్పందం కేసీఆర్‌-జగనల ప్రగతిభవన్ భేటీలోనే జరిగిందా లేదా అని నిలదీశారు.

Exit mobile version