Warangal: ప్రీతి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన మంత్రులు KTR, ఎర్ర‌బెల్లి

ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని హామీ మంత్రి కెటిఆర్‌ను క‌లిసిన కోళ్ల‌ రైతులు Ministers KTR and Errabelli.. Preeti Family విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రీతి కుటుంబాన్ని(Preeti Family) రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి కెటి రామారావు(Minister KTR), మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు(Minister Errabelli Dayakar Rao) తో క‌లిసి బుధవారం తొర్రూరు(Torruru)లో ప‌రామ‌ర్శించారు. తొర్రూరుకు వివిధ కార్య‌క్ర‌మాల కోసం వ‌చ్చిన కెటిఆర్ ను క‌ల‌వ‌డానికి […]

  • Publish Date - March 8, 2023 / 03:58 PM IST

  • ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని హామీ
  • మంత్రి కెటిఆర్‌ను క‌లిసిన కోళ్ల‌ రైతులు

Ministers KTR and Errabelli.. Preeti Family

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రీతి కుటుంబాన్ని(Preeti Family) రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి కెటి రామారావు(Minister KTR), మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు(Minister Errabelli Dayakar Rao) తో క‌లిసి బుధవారం తొర్రూరు(Torruru)లో ప‌రామ‌ర్శించారు. తొర్రూరుకు వివిధ కార్య‌క్ర‌మాల కోసం వ‌చ్చిన కెటిఆర్ ను క‌ల‌వ‌డానికి ప్రీతి కుటుంబం ప్ర‌త్యేకంగా తొర్రూరుకు వ‌చ్చింది. విష‌యం తెలుసుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి, కెటిఆర్ ను ప్ర‌త్యేకంగా వారికి అవకాశం క‌ల్పించారు.

ఈ సంద‌ర్భంగా కెటిఆర్ ప్రీతి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతూ, ప్రీతి మృతికి సంబంధించిన కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంబంధిత నివేదిక‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఒక ప్ర‌త్యేక క‌మిటీని కూడా వేసింది. పూర్తి వివ‌రాలు తెలిశాక స్పందిస్తాం. దోషులు తేలిన త‌ర్వాత ఎంత‌టి వారైనా వారిని వ‌దిలేది లేదు. ప్రీతి లాంటి ఘ‌ట‌న మ‌ళ్ళీ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తాం. అలాగే ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకుంటాం. అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. దీంతో ప్రీతి కుటుంబ స‌భ్యులు కెటిఆర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మంత్రి కెటిఆర్‌ను క‌లిసిన కోళ్ళ రైతులు

తెలంగాణ ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న కోడిగుడ్ల కాంట్రాక్టులో కొత్త నిబంధనల కారణంగా కోళ్ల రైతులందరూ అందులో పాల్గొన లేకుండా పోతున్నారని కొద్దిమంది వ్యాపారస్తులకి ప్రయోజనకరముగా ఉన్నదని కావున కొత్త నిబంధనలను రద్దుచేసి పాత పద్ధతిలో కోళ్ల రైతులందరూ పాల్గొనే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం వరంగల్ జిల్లా కోళ్ల రైతులందరూ తొర్రూరులో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.రామారావును మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌మ‌క్షంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు.

కోళ్ల పరిశ్రమ ప్రస్తుతము నష్టములతో నడుస్తున్నదని గుడ్ల సరఫరాలో కూడా కోళ్ల రైతులను పాల్గొనకుండా చేసినచో కోళ్ల రైతులు మరింత నష్టాలకు గురికావలసి వస్తుందని వారు తెలిపారు. మంత్రి సమస్యను అర్థము చేసుకొని తిరిగి పాత పద్ధతిలోనే గుడ్ల సరఫరాలకు టెండర్లను జిల్లాలా వారీగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు శ్యాంసుందర్రావు, రామారావు, సుబ్రహ్మణ్యం, రాంప్రసాద్, గులాం సందాని తదితరులు పాల్గొన్నారు.

అనంత‌రం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు.

Latest News