Site icon vidhaatha

K K Mahender Reddy l సిరిసిల్లలో మంత్రి మాఫియాలదే రాజ్యం: కాంగ్రెస్‌ ఛార్జిషీటు విడుదల

Minister’s Mafia Kingdom in Sirisilla: Congress

విధాత: మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల(Sirisilla) అసెంబ్లీ నియోజకవర్గం ఇసుక మాఫియా, చేనేత దళారుల అక్రమార్కులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని కాంగ్రెస్ (Congress) నాయకుడు కె.కె.మహేందర్ రెడ్డి విమర్శించారు.

ఇవాళ సిరిసిల్లలోని పద్మానగర్‌లో మహేందర్‌రెడ్డి మున్సిపల్ మంత్రి కెటిఆర్(KTR) పై ఛార్జ్ షీట్‌ను విడుదల చేశారు. నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్న కెటిఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక మేనిఫెస్టో పెట్టి గొప్పలు చెప్పుకున్నారన్నారు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ ఛార్జ్ షీట్ తయారు చేశామన్నారు.

బీఆర్ ఎస్ అరాచ‌కాల‌తో చార్జ్‌షీట్‌..

ముఖ్యమంత్రి కెసిఆర్ తన స్వార్థ ప్రయోజనం కోసమే టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మార్చారని ఆరోపించారు. ఇక్కడ బిఆర్ఎస్ దోచుకు తింటుంటే కేంద్రలో బిజెపి ప్రజలను అడ్డగోలుగా దోపిడి చేస్తున్నదని మహేందర్ రెడ్డి ఆరోపించారు.

ఛార్జ్ షీటులోని అంశాలు ఇలా ఉన్నాయి.

కెటిఆర్ అండదండలతో అనుచరులు అక్రమంగా ఇసుక, మొరం దందాలు చేస్తున్నారని, వీటిని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కమీషన్లు ఇస్తే బతుకమ్మ చీరల పథకం కింద నేతన్నలకు వర్క్ ఆర్డర్లు ఇస్తారు.

అమ‌లు కానీ హామీలు ఎన్నో…

టిఆర్ఎస్ వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు డబుల్ బెడ్ రూమ్ కేటాయింపుల్లో ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి రూ.1 లక్ష లంచం తీసుకున్నారు. ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. మంత్రి అసమర్థత కారణంగా మెడికల్ కాలేజీ రాలేదు. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి, పనులు చేయించలేకపోతున్నారు. మంత్రి అనుచరులు కమీషన్లు అడుగుతుండడంతో పనులు కావడం లేదు. సెస్‌లో అవినీతికి మద్ధతు ఇస్తూ, తన అనుచరులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.

మంత్రి కెటిఆర్ అండ చూసుకుని బావమరిది నియోజకవర్గంలోని అమాయక విద్యర్థినుల పట్ల కీచక పర్వం కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల మునిసిపల్ ఛైర్ పర్సన్ భర్త నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు యధేచ్చగా ఆక్రమిస్తున్నారు. కెటిఆర్ అన్యాయాలను ఎదిరిద్దాం, సిరిసిల్ల ప్రజల సత్తా చూపుదాం అని ఛార్జి షీట్ లో పిలుపునిచ్చారు.

Exit mobile version