Site icon vidhaatha

నా సంగతి మీకు తెలియదు.. మా రోడ్లపై నడవొద్దు, పథకాలు తీసుకోవద్దు: మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

విధాత: వేరే పార్టీ వాళ్లు సీఎం కేసీఆర్ వేసిన రోడ్లపై నడవద్దు.. కళ్యాణ లక్ష్మీ, పెన్షన్లు ఇతర స్కీములు వేరే.. తీసుకోవద్దు. అభివృద్ధి చేసే వాళ్లకు.. అన్నం పెట్టే వాళ్లకు సున్నం పెడతారా అంటూ.. గడిచిన ఐదు రోజుల క్రితం.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని నర్సాపురం గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపనకు వెళ్లిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర రావు గ్రామస్థులను హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కొందరు ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయమాటలకు లోను కావద్దన్నారు. తిని తినలేదన్నట్లుగా అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారి సంగతి కళ్లెంపల్లి మైసమ్మ చుసుకుంటారన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదని హుకుం జారీ చేశారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారు కేసీఆర్ వేసిన రోడ్లపై నడవొద్దని, పథకాలు తీసుకోవద్దన్నారు. మాయమాటలు చెప్పే వారు పింఛన్లు మంజూరు చేయించలేరని అన్నారు.

నర్సాపురం గ్రామంతో ఏదో అయిపోదని, నా సంగతి మీకు తెలియదు నేను మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటానని హెచ్చరించారు. ప్రభుత్వ స్కీంలు తీసుకుంటూ నర్సాపూర్‌తో డ్యాన్స్ చేయిస్తామంటే నేను ఐదు నిమిషాల్లో డ్యాన్స్ చేయిస్తానంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నర్సాపురంతో నాకేది కాదు స్కీములన్ని సీఎం కేసీఆర్ ఇచ్చిన్రా.. మరెవరైనా తెచ్చారా.. దమ్ముంటే ఇరవై పెన్షన్లు తీసుక రమ్మంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version