Site icon vidhaatha

హామీలపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటు


విధాత, హైదరాబాద్‌ : హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ట్విటర్‌ళో విమర్శించారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని, ఎల్ఆరెస్‌ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైందని విమర్శించారు. నో ఎల్‌ఆరెస్‌ – నో బీఆరెస్‌ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఎల్‌ఆరెస్‌కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమన్నారు.


కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్‌ఆరెస్‌ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలన్నారు. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని హరీశ్‌రావు తన ట్వీట్‌లో పేర్కోన్నారు.

Exit mobile version