Site icon vidhaatha

కాంగ్రెస్ శ్వేత‌ప‌త్రం.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై దాడిలా ఉంది : హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ : రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్‌ నాయకులు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసిన సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడారు. సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించిందన్నారు. కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నారు. రాజకీయ కక్షల చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా.. అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది.. ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిదని సూచించారు. కానీ ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు.. శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు, ప్రగతి అనే కోణం కన్నా.. రాజకీయ ప్రత్యర్థులపై దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుందని మాజీ మంత్రి మండిప‌డ్డారు.


ఆర్థిక శ్వేతపత్రం పేజి 5లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్‌ అంచనా- వ్యయాలకు సంబంధించి కాగ్‌ రిపోర్టు చూశామని హరీశ్‌రావు తెలిపారు. అందులో బడ్జెట్‌ అంచనా 2,31,142 కోట్లు ఉంటే.. 2,31,642 కోట్లుగా చూపించారన్నారు. వ్యయాల్లో కూడా 2,61,932 కోట్లు అని చూపించారని.. కాగ్‌ రిపోర్టు ఆధారంగా 2,54,525 కోట్లు ఉందన్నారు. అంటే.. దాదాపు 7 వేల కోట్ల ఎక్సపండిచర్‌ ఎక్కువగా చూపించారని తెలిపారు. మొత్తంగా తప్పుల తడకగా వివరాలు పొందుపరిచారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ధోరణి ఇందులో కనిపిస్తుందని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

Exit mobile version