Site icon vidhaatha

పార్టీ మారబోను..కేటీఆర్‌తో భేటీలో మల్లారెడ్డి స్పష్టీకరణ?

విధాత : మాజీమంత్రి, మేడ్చల్ మల్కాజిగిరిఎమ్మెల్యే చ మకూర మల్లారెడ్డి, ఆయన కొడుకు భద్రారెడ్డిలు శుక్రవారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ముందురోజు సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేమిరెడ్డి నరేందర్‌రెడ్డితో మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలు భేటీ కావడంపై కేటీఆర్‌కు వారు వివరణ ఇచ్చుకున్నట్లుగా సమాచారం.


కాంగ్రెస్‌లో చేరే ఉద్ధేశంతోనే వారు వేమిరెడ్డితో భేటీ అయినట్లుగా ప్రచారం జరిగింది.పార్టీ మారుతారంటూ చోటుచేసుకున్న ప్రచారంపై కేటీఆర్‌తో భేటీలో మల్లారెడ్డి చర్చించారని, తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని, పార్టీ మారబోనని స్పష్టం చేసినట్లుగా సమాచారం.


తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి దుండిగల్ వద్ద నిర్మిస్తున్న ఎరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్ ఐటీ కళాశాలలకు చెందిన భవనాలు, షెడ్లను చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్నాయంటూ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కూల్చేశారని, దీనిపై తాము చర్చించేందుకు వేమిరెడ్డిని కలిశామని కేటీఆర్‌కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల కథనం. అలాగే మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పోటీపై తాను, తన కొడుకు భద్రారెడ్డిల పోటీ విషయమై కూడా వారు కేటీఆర్‌తో చర్చించారని, పోటీ పట్ల తమ నిరాసక్తతను ప్రదర్శించినట్లుగా తెలుస్తుంది.

Exit mobile version